Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డాక్టర్ హమీద్ అన్సారీపై బీజేపీ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను ఉపసంహారించుకోవాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయన చిత్తశుద్ధిపై, దేశభక్తిపై బీజేపీ చేసిన నిరాధారమైన దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రముఖ విద్యావేత్తగా, దౌత్యవేత్తగా, భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారని పేర్కొన్నారు. ఆయన ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా అనేక వేదికలలో భారతదేశ ప్రయోజనాలకు అనుగుణంగా సేవలందించారని గుర్తుచేశారు. రాజ్యాంగ విలువల కోసం ధృఢంగా నిలబడే ప్రముఖులపై దాడి చేసేందుకు బీజేపీ సాధారణంగా చేసే చౌకబారు ఎత్తుగడలు మానుకోవాలని ఆ పార్టీకి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ హమీద్ అన్సారీపై హానికరమైన అబద్ధాలను ఆపాలని డిమాండ్ చేశారు.