Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారీ వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ శర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, పంట, ప్రాణ నష్టంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో రాష్ట్రం విలవిలలాడుతుంటె ప్రజలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడంటూ ప్రశ్నించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి అధ్యయనంపై ఏరియల్ సర్వే కూడా నిర్వహించలేదని తెలిపారు. జనం బాధల్లో ఉంటే గుండె ధైర్యం ఇవ్వాల్సింది పోయి గూగుల్ మ్యాప్ చూస్తూ గప్పాలు కొడుతున్నారంటూ విమర్శించారు. ముందస్తు ఎన్నికల మీద ఉన్న సోయి వరద బాధితులను ఆదుకోవడంలో లేదని పేర్కొన్నారు. 15 లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయి రైతన్న కన్నీరు పెడుతున్నారని తెలిపారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.