Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడుదల చేసిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆజాదీ కా అమత్ మహౌత్సవాల్లో భాగంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) జిల్లాల వారీగా రూపొందించిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ మ్యాప్ (డీఆర్ఎమ్)లను ఆసంస్థ అదనపు డైరెక్టర్ జనరల్ జనార్ధన్ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మ్యాపుల ద్వారా ఏఏ జిల్లాల్లో నిర్దిష్ట భూగర్భ నిల్వల వివరాలు, ఖనిజ వనరులు తెలుస్తాయని చెప్పారు. భౌగోళిక శాస్త్రాన్ని వర్ణించే ఇన్సెట్ మ్యాప్లు, జియోహైడ్రాలజీ, జియోటెక్నికల్ లక్షణాలతో ఆరు జిల్లాల వనరుల వివరాలు ఈ పటాలలో ఉంటాయని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్, పెద్దపల్లి, వనపర్తి, మెదక్, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల పటాలు మాత్రమే వున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలలు, విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం జియోలాజికల్ ప్రదర్శన, ప్రయోగశాలల సందర్శన, జీఐఎస్ విజయాలపై చర్చ్చా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.