Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్రాస్బౌ షూటింగ్లో రాష్ట్రం నుంచి తొలి సారిగా బంగారు పతకాన్ని సాధించిన లక్ష్మి చైతన్య, సిల్వర్ మెడల్ సాధించిన భువనేశ్వరిలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో అభినందించారు. తెలంగాణ క్రాస్బౌ షూటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. క్రాస్బౌక్రీడ అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతున్నదని ప్రతినిధులు మంత్రికి వివరించారు. రాష్ట్రంలో నిర్వహించేందుకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాస్కెట్ బాల్ హెడ్ కోచ్ జార్జి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుమన్ కుమార్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.