Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కే తారకరామారావు కృతజ్ఞత లు,ధన్యవాదాలు తెలిపారు. పార్టీ శ్రేణుల వల్లే ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందుతున్నాయనీ,ప్రభుత్వం వారితో సమన్వయం చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పార్టీ శ్రేణులు ఇలాగే ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
కిషన్రెడ్డి మాటలకు తలాతోక లేదు-పల్లా రాజేశ్వరరెడ్డి
ధాన్యం సేకరణపై కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. శుక్రవారంనాడాయన టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే జాజుల సురేందర్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి మాట్లాడారు.