Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 400 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా ఐటీ పార్క్‌ను నిర్మిస్తున్నామని మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తమ క్యాంపు కార్యాలయంలో వరల్డ్ స్కిల్ డే సందర్భంగా తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టీఏఎస్కే) సీఈఓ శ్రీకాంత్ సిన్హా, డైరెక్టర్ భాస్కర్ మర్యాద పూర్వకంగా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ పార్క్‌లో టీఏఎస్కె సంస్థకు సుమారు ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక శిక్షణ కేంద్రం ఏర్పాటుకు శాశ్వత ప్రాతిపదికన ఐటీ టవర్‌లో ఆఫీసును కేటాయించనున్నారు. ఈ శిక్షణ కేంద్రంను అక్టోబర్-22లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఆధునిక శిక్షణతో పాటు, పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణ, ఉపాది రంగంలో సేవలు అందిస్తున్న యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.