Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వానలు, వరదలతో రాష్ట్రంలో రైతులు లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయారని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. అనేక ఇండ్లు కూలిపోయాయనీ, రోడ్లు దెబ్బతిన్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చేతివృత్తులు, ఇతర డ్రిప్ ఇరిగేషన్, స్పింక్లర్స్ రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఈ విపత్తు రాష్ట్రానికి, ప్రజలకు తీరని నష్టం కలిగించిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పునరావాస బాధితులకు తగిన వైద్యం, ఆహార సదుపాయాలు కల్పించాలని సూచించారు. పంటనష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.రెండు లక్షలు పరిహారమివ్వాలనీ, వ్యవసాయం తిరిగి చేసేందుకు మేటలు ఎత్తిపోయడానికి కేటాయించాలని కోరారు. విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని తెలిపారు. పంటనష్టం, ఇతర నష్టాలను శాస్త్రీయంగా అంచనా చేయాలని పేర్కొన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి పక్కా ఇండ్లు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న డ్రిప్, స్పింక్లర్స్ వారికి వాటిని అందించాలని తెలిపారు. వ్యవసాయ కూలీలకు రూ.పది వేల సహాయం అందించాలని పేర్కొన్నారు. దెబ్బతిన్న రోడ్లు, రవాణా సౌకర్యాలను తక్షణమే పునరుద్ధరించాలని వివరించారు.