Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద బాధితులను తరలిస్తుండగా ఘటన
- ఒకరు గల్లంతు..?
- 11 మంది సురక్షితం
నవతెలంగాణ-బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల కేంద్రమైన బూర్గంపాడులో వరద బాధితులను తరలిస్తున్న నాటు పడవ బోల్తాపడింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది వుండగా 11మంది సురక్షితంగా బయట పడ్డారు. బూర్గంపాడులోని భారతీభవన్లో వున్న వరద బాధితులు నాటు పడవలో బూర్గంపాడు మొయిన్ సెంటర్కు బయలుదేరారు. నాటుపడవ గోదావరిలో మిల్లు సెంటర్ వద్దకు రాగా విద్యుత్ స్తంభానికి ఢకొీట్టినట్టు తెలిసింది. ఈ సమయంలో పడవలో ఉన్న 12 మంది ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. అందరూ ఒక్కసారిగా కేకలు వేయటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం, స్థానిక యువత 11మంది రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో నాటు పడవలో ప్రయాణిస్తున్న బూర్గంపాడు ఎస్సీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి గల్లంతైనట్టు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.