Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘటనకు కారణమైన ఫుడ్ కాంట్రాక్టర్లను తొలగించాలి: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులకు ఫుడ్ ఫాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరింది. ఈ ఘటనకు కారణమైన ఫుడ్ కాంట్రాక్టర్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పకోడీ ద్వారా మరోసారి ఎగ్‌రైస్ తినడం ద్వారా విద్యార్థులకు ఫుడ్ ఫాయిజన్ అయ్యిందని తెలిపారు. అధికారులు సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఫుడ్ పాయిజన్ అయినా ఆస్పత్రికి తరలించకుండా క్యాంపస్‌లోనే మాత్రలు ఇచ్చి వైద్యం చేయించారని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించలేదని తెలిపారు. కనీసం తల్లిదండ్రులకూ సమాచారం ఇవ్వకుండా సీరియస్‌గా ఉన్న కొంత మంది విద్యార్థులను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారని వివరించారు. పర్యవేక్షణ చేయకుండా ఉన్న భాద్యులైన అధికారులను తక్షణమే తొలంగించాలని డిమాండ్ చేశారు. ఫుడ్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలనీ, కాంట్రాక్టును రద్దు చేయాలని కోరారు.
చర్యలు తీసుకోవాలి : పీడీఎస్‌యూ
కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన బాసర త్రిపుల్‌ఐటీ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎం పరశురాములు, ప్రధాన కార్యదర్శి ఈ విజరుకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలుషితమైన భోజనం అందించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి కోరారు. మెస్ కాంట్రాక్టర్‌ను తొలగించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనారోగ్యానికి గురైన విద్యార్థుల వివరాలను వారి తల్లిదండ్రులకు తెలియజేయకుండా అధికారులు గోప్యత పాటించటం సరైంది కాదని పేర్కొన్నారు.