Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీలంకలో రాజపక్సే కుటుంబానికి పట్టిన గతే తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు పడుతుందని ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు మధు యాష్కీ, చిన్నారెడ్డి, గీతారెడ్డి, సుధీర్ రెడ్డి, దేపభాస్కర్రెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన సర్వేలో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతున్నదని చెప్పారు. కేటిఆర్‌కు కండ్లునెత్తికెక్కి అహంకార పురితంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'శాసనసభ ఇప్పుడు రద్దు చేయండి.ఇప్పటికిప్పుడు మేము ఎన్నికలకు సిద్ధం' అని సవాల్ విసిరారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ మాదే విజయని చెప్పారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతున్నదన్నారు. గోదావరి వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చా విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచిత ఆంగ్లవిద్యకు అతీగతీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల మంది విద్యార్థులకు రూ 3,270 కోట్ల ఫీజు బకాయిలు పడిందని చెప్పారు. వెంటనే ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మన ఊరు మన బడి కోసం ఫిబ్రవరి 3న ప్రకటించారనీ, అంతకు విధుల విడుదల చేయలేదని విమర్శించారు.