Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మన ఊరు-మన బడి పథకాన్ని అమలు చేసే క్రమంలో ప్రభుత్వ బడులు, స్థానిక సంస్థల పాఠశాలలకు పెయింటింగ్స్ వేసే నిమిత్తం పిలిచిన టెండర్‌ను సవాల్ చేసిన రిట్‌ను పిటిషనర్ కంపెనీ వెనక్కి తీసుకుంది. ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్, మరో కంపెనీకి టెండర్ లభించేలా నిబంధనలు రూపొందించారని సువర్ణ శ్రీవెంకటేశ్వర ఇన్ఫ్రాకాన్ హైకోర్టులో వేసిన రిట్‌ను శుక్రవారం వెనక్కి తీసుకుంది. దీంతో రిట్‌ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బల్లలు, ఫర్నీచర్, బోర్డులకు చెందిన రెండు టెండర్లను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.కాగా తమ సర్వీసును లెక్కించకపోవడంతో సీని యారిటీ నష్టపోయామంటూ ఐదుగురు కన్ఫర్డ్ ఐఏఎస్‌లు వేసిన కేసు లో హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైకోర్టులు ఆదేశించినా సీనియా రిటీని లెక్కించలేదంటూ ఆంధ్రప్రదేశ్ అధికారులు జీఎస్ఆర్కేఆర్ విజరు కుమార్, కేఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి, ఎం గిరిజాశంకర్, తెలంగాణ అధికారులు జీ కిషన్, జీ రవిబాబు హైకోర్టును ఆశ్రయించారు.