Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శనివారం వెళ్లనున్నారు. భద్రాద్రి రామాలయం, పరిసర ప్రాంతాలు, కరకట్ట మీదుగా గోదావరి బ్రిడ్జి, కూనవరం రోడ్డు, భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, అక్కడి పునరావాస కేంద్రాలు, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మూసివేసిన రోడ్లు, వరద తీవ్రతను పరిశీలించనున్నారు. భద్రాచలంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులను పరామర్శిస్తారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకుంటారు.అదేవిధంగా పంట పొలాలను పరిశీలించనున్నారు.