Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న సహాయక, పునరావాస చర్యలను సీఎస్ సమీక్షించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ జిల్లాకు ఎన్డీిఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి, రెస్క్యూ టీమ్‌లను భద్రాచలం, కొత్తగూడెం పట్టణాల్లో ఉంచినట్లైయితే, వరద సహాయక చర్యలు సమర్థవంతంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. వరద నీరు 80 అడుగులకు చేరినా పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని సీఎస్ ఆదేశించారు. ముంపునకు గురయ్యే గ్రామాలు, ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి ప్రత్యేక పునరవాస శిబిరాలకు తరలించాలని సూచించారు. ఇప్పటికే భద్రాచలంలో 10 ఎన్డీఆర్ఎఫ్ బందాలు, ఆర్మీకి చెందిన 5 బృందాలు, సింగరేణి రెస్క్యూ టీమ్‌లు సిద్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా కూడా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలనీ, అన్ని సహాయక శిబిరాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ఐటీసీ భద్రాచలం వద్ద అందుబాటులో ఉంటుందని సీఎస్ వివరించారు. సహాయక చర్యలలో జిల్లా యంత్రాంగానికి తోడ్పాటుగా మరో నలుగురు సీనియర్ అధికారులను నియమించారు. నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్లు, బస్సులు, ట్రక్కులు కూడా భద్రాచలానికి తరలిస్తున్నట్టు తెలిపారు. సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు, పర్యవేక్షించేందుకు పోలీసు ఉన్నతాధికారులకు కూడా బాధ్యతలు అప్పగించినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు