Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహేగామ్ మండలంలో వరదల్లో చిక్కుకున్న గ్రామస్థులను కాపాడే ప్రయత్నంలో సింగరేణి రెస్క్యూ విభాగానికి చెందిన ఇద్దరు సిబ్బంది మతి చెందడం అత్యంత దురదష్టకరమని ఆ సంస్థ జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) కే సూర్యనారాయణ అన్నారు. ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకునేందుకు ప్రాణాలకు తెగించి పనిచేసే రెస్క్యూ విభాగం ఇద్దరు సుశిక్షితులను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే క్రమంలో గల్లంతై మతి చెందిన చిలుక సతీష్, అంబాల రాముకి శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ గ్రామస్థులను రక్షించేందుకు సింగరేణి రెస్క్యూ సిబ్బందిని పంపించాలన్న జిల్లా ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు సింగరేణి బందం ఈ నెల 13 తేదీ సాయంత్రం దహేగామ్ మండలం పెసరకుంట గ్రామానికి వెళ్లిందని తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వాగులో గల్లంతయ్యారనీ, వారిని రక్షించేందుకు సింగరేణి రెస్క్యూ సిబ్బంది, కేంద్ర విపత్తు ప్రతిస్పందన బందాలతో (ఎన్.డి.ఆర్.ఎఫ్.) రాత్రంతా గాలింపు చేపట్టినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేదన్నారు. విపత్తులు, ప్రమాదాలు, ప్రకతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు జిల్లా యంత్రాంగం విజ్ఞప్తులపై అనేక సంద ర్భాలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలు అందించి వందలాది మందిని సురక్షితంగా కాపాడారని ఆయన గుర్తుచేశారు. కానీ, తాజా ఘటనలో ఇద్దరు సుశిక్షితులైన రెస్క్యూ సిబ్బందిని సింగరేణి కోల్పోవడం బాధాకర మన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. సీఎంవోఏఐ జనరల్ సెక్రటరీ ఎన్.వి.రాజశేఖరరావు, అడ్మినిస్ట్రే టివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, పాల్గొన్నారు.