Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ సంస్థల ఉద్యోగుల వేతన సవరణలో తమ ప్రతిపాదనలను అమలు చేయాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్-327 విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వేతన సవరణ చర్చల కమిటీ చైర్మెన్, టీఎస్ ట్రాన్స్‌కో జేఎమ్డీ సీ శ్రీనివాస రావు, కన్వీనర్ శ్రీనివాస్‌కు శుక్రవారం ప్రతిపాదనల ప్రతులను అందచేశారు. 327 యూనియన్ సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ ప్రభాకరరావు, రాష్ట్ర నాయకులు పీ రమేష్, కే శ్రీనివాస్, టీఎస్ఎస్పీడీసీఎల్ సెక్రటరీ కే భూపాల్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్ అధ్యక్ష, కార్యదర్శులు పీ మహేందర్‌రెడ్డి, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ 45 శాతం ఫిట్మెంట్, సింగిల్ మాస్టర్ స్కేల్, అపరిమిత వైద్య సదుపాయాలు, కోటిరూపాయల ఇన్సూరెన్స్, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌లోకి పెన్షన్ మార్పు, ఆర్టిజన్లకు 80 శాతం ఫిట్మెంట్, అన్‌మ్యాన్ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించాలనీ, క్రిందిస్థాయి ఉద్యోగి వేతనాన్ని రూ.40వేలకు తగ్గకుండా నిర్ణయించాలనే పలు ప్రతిపాదనలు చేసినట్టు వివరించారు. తమ ప్రతిపాదనల పట్ల కమిటీ చైర్మెన్, కన్వీనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.