Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ గిరిజన సంఘానికి అందజేసిన సీఐటీయూ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పోడు రైతులు సాగిస్తున్న ఉద్యమానికి మద్దతుగా రూ.50 వేల రూపాయలను సంఘీభావ నిధిని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బండారు రవికుమార్‌కు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్, కోశాధికారి వంగూరు రాములు అందజేశారు. ఈ సందర్భంగా చుక్కరాములు మాట్లాడుతూ..సీఐటీయూ రాష్ట్ర వ్యాప్త క్యాంపెయిన్‌లో కార్మికుల నుంచి సేకరించిన నిధిని ఆదివాసీ గిరిజన సంఘానికి అందజేయడం తమ బాధ్యత అన్నారు. ఇది తొలి విడత సహాయమనీ, మళ్లీ రెండో విడత అందజేస్తామని తెలిపారు. ఆర్థిక, వర్గ, సామాజిక ఉద్యమాలు జమిలిగా జరగడం ప్రస్తుత సంక్లిష్ట, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నదని చెప్పారు. బండారు రవికుమార్ మాట్లాడుతూ..సంఘీభావ నిధి అందించిన సీఐటీయూ రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పోడు రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తున్న ఆదివాసీ గిరిజనుల ఉద్యమానికి ఇది ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. పాలడుగు భాస్కర్ మా ట్లా దోపిడీ వ్యవస్థకు నిర్మూలించడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. కుల వివక్ష వ్యతిరేక, ఆదివాసీ, గిరిజన, మహిళా, మైనార్టీ హక్కుల కోసం కార్మికవర్గం ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని హామీనిచ్చారు.
అగ్నిపథ్‌ను రద్దు చేయాలని నేడు, రేపు సీఐటీయూ నిరసన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శని, ఆదివారాల్లో నిరసనలు తెలుపనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్‌లో జరిగిన కాల్పుల ఘటను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.