Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ సంస్థల వేతన సవరణ చర్చల కమిటీకి హెచ్-1829 ప్రతిపాదనలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.37,880కి పెంచి, దానిపై 45 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సీఐటీయూ అనుబంధ తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్ 1829) డిమాండ్ చేసింది. ఈ మేరకు వేతన సవరణ చర్చల కమిటీ చైర్మెన్, ట్రాన్స్‌కో జేఎమ్డీ శ్రీనివాసరావు, టీఎస్ జెన్కో డైరెక్టర్లు అశోక్‌కుమార్, టీఆర్కే రావు, టీఎస్ఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ పర్వతంకు 20 ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాలను శుక్రవారం యూనియన్ నాయకులు అందచేశారు. యూనియన్ గౌరవ అధ్య క్షులు భూపాల్, అధ్యక్షులు వీ కుమారచారి, ప్రధాన కార్యదర్శి వీ గోవర్ధన్, టీఎస్ఎస్పీడీసీఎల్ కంపెనీ కమిటీ అధ్యక్షులు కే మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జే ప్రసాద్‌రాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి జే బస్వరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టిజన్, ఓఆండ్ఎమ్ ఉద్యోగులకు 45 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలనీ, ఆర్టిజన్ కార్మికుల పర్సనల్ పే ను బేసిక్‌లో కలపాలని ప్రతిపాదనల్లో కోరారు.
ఆర్టిజన్ కార్మికులకు కూడా ఓ అండ్ ఎమ్ ఉద్యోగులతో సమానంగా అన్ని అలవెన్సులు కల్పించాలనీ, ఆన్ మ్యాన్ గ్యాంగ్ కార్మికులను కూడా ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పీసురేటు కార్మికుల కు కనిసవేతనాలు ఇవ్వాలనీ, కార్మికులందరికీ ఆన్ లిమిటెడ్ మెడికల్ క్రెడిట్ ఇవ్వాలని కోరారు. ఈపీ ఎఫ్ నుంచి జీపీఎఫ్ సమస్య, వేతన స్కేళ్ల వ్యత్యా సాలు పరిష్కరించాలనీ, సమాన పనికి సమా న వేతనం ఇవ్వాలనీ, పెన్షనర్ల సమస్యలు, అలవెన్సుల నూ సవరించాలని తమ ప్రతిపాదనల్లో కోరారు.