Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాయికల్:జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన 9 మంది కూలీలు గోదావరి లో చిక్కుకున్న వార్త కవరేజీ కోసం వెళ్లి గల్లంతైన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. రామోజీపేట్, భూపతిపూర్ వద్ద రోడ్డులో కారుతో సహా వరద ప్రవాహంలో ఈనెల 12న మంగళవారం రాత్రి గల్లంతయ్యాడు. మూడ్రోజుల తరువాత కారును గుర్తించారు. అందులో జమీన్ లేకపోవడంతో మరికొంత దూరం వరకూ గాలించారు. ఒర్రె శివారు ప్రాంతంలోని చెట్ల పొదల్లో జమీన్ మృతదేహాన్ని గుర్తించారు. మూడ్రోజులు మృతదేహం నీటిలోనే ఉండటంతో తీసేందుకు వీలుకాకపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అధికారులతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజ రు కుమార్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూ శర్మ ఘట నా స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలను పర్య వేక్షించారు. జమీర్ మృతదేహాన్ని జిల్లా కేంద్రానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.