Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికీ ఇండ్లు, ఉపాధి, భూమి కోసం ఆగస్ట్1న దేశవ్యాప్త ఆందోళనలు :
- ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచంలో ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రజలు తిరస్కరిస్తున్నారశ్రీష, ప్రజల జీవితాలను మార్చగలిగినవి సోషలిస్టు ఆర్థిక విధానాలు మాత్రమేనని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి బి. వెంకట్ అన్నారు. అందరికీ భూమి, ఇండ్లు, ఉపాధి కావాలనే డిమాండ్లతో ఆగస్టు ఒకటో తేదీన దేశవ్యాప్తంగా 500 జిల్లా కేంద్రాలలో తలపెట్టిన ఆందోళనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన ఆ సంఘం సమావేశం జరిగింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామన్న వాగ్దానాన్ని వమ్ము చేసిందని విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను, ఎఫ్సీఐ గోదాములను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని ఒక దేశం ఒకే రేషన్ కార్డు ఒకే రేషన్ నినాదంతో పేదల పొట్ట కొట్ట జూస్తున్నదని అన్నారు. నగదు బదిలీని రేషన్ వ్యవస్థలో తీసుకొచ్చి ఓపెన్ మార్కెట్కు పేదల బతుకును అప్పగించాలని చూసే ప్రయత్నంను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉపాధిహామీ అమలు నీరుగార్చిందనీ, కోట్ల రూపాయలు ఉపాధి వేతన బకాయిలు పెట్టిందని విమర్శించారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల విద్యా, వైద్యం అందించే బాధ్యత నుంచి కేంద్రం తప్పుకో జూస్తున్నదని విమర్శించారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా తొక్కి పట్టిందన్నారు. అడవుల్లోని సహజ సంపదను కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు అప్పగించడానికి పోడు సాగుదారుల్ని అడవుల నుంచి తరిమేస్తున్నదనీ, ఎస్ఆర్సి పట్టాలివ్వకుండా నిర్బంధం ప్రయోగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ప్రసాద్, కార్యదర్శులు కొండమడుగు నర్సింహ, పెద్ది వెంకట్రాములు, పొన్నం వెంకటేశ్వరరావు, ఎ. వెంకట్రాజం, అల్వాల వీరయ్య, ఆర్. శశిధర్, ఎం. వెంకటయ్య, ఎం. ఆంజనేయులు, ఎం. రాములు, మహిళా కన్వీనింగ్ కమిటీ బి. పద్మ, ఎం. సైదులు, ఎం.రాములు, వెలిది పద్మావతి తదితరులు పాల్గొన్నారు.