Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు లక్షల మందికి మధుమేహం
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అసంక్రమిక (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) ను గుర్తించే కార్యక్రమంలో భాగంగా 1.34 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించి ఆరు లక్షల మంది డయాబెటిక్ రోగులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఐడియా క్లినిక్స్ నిర్వహి ంచిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ, బీపీ, షుగర్ తదితర అసంక్రమిత వ్యాధుల నివారణకు ప్రభుత్వం ఎర్లీ స్క్రీనింగ్, ఎర్లీ ట్రీటింగ్ విధానాన్ని అనుసరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నదని తెలిపారు. ఉచితంగా మందుల కిట్లను అందజేస్తూ అవి ఎలా వాడాలో రోగులకు వివరిస్తున్నట్టు చెప్పారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రార ంభించిన హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును రాష్ట్రమంతటా త్వరలో విస్తరించనున్న ట్టు వెల్లడించారు. బీపీ, షుగర్ వ్యాధులను ముందే గుర్తించి మందులు వాడి తే ప్రయోజనం ఉంటుందనీ, లేకపోతే చాపకింద నీరుగా ఆరోగ్యాన్ని క్షీణింప జేస్తాయని హెచ్చరించారు. వ్యాయామం, నడక అలవాటు చేసుకోవాలనీ, అధిక బరువును తగ్గించుకోవాలని సూచించారు. డాక్టర్ సుధాకర్ రావు ఆధ్వ ర్యంలో జరుగుతున్న డయాబెటిక్, ఎండోక్రైనాలజీ రీసెర్చ్ అప్ డేట్ -2022 ద్వారా అనేక విషయాలు నేర్చుకునే వీలు కలుగుతుందని అభినందించారు.