Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
జెకె టైర్ అండ్ ఇండిస్టీస్ లిమిటెడ్ తమ నూతన జెకె టైర్ ట్రక్ వీల్ సెంటర్ను నెల్లూరులో ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రతిష్టాత్మక కేంద్రాన్ని అత్యుత్తమ శ్రేణిలో వినియోగదారులకు పరిష్కారాలను అందించే రీతిలో దీన్ని తీర్చిదిద్దినట్టు ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ సంజీవ్ శర్మ తెలిపారు. దీంతో దక్షిణాదిలో తమ నెట్వర్క్ను 29 కేంద్రాలకు చేర్చినట్టయిందన్నారు. దేశంలో 71వ కేంద్రమన్నారు. నూతన అవుట్లెట్ వినియోగదారుల అన్ని రకాల టైర్ అవసరాలను తీర్చనుందన్నారు.