Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజరు విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
జీతాలివ్వడం చేతగాని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆర్దిక క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు అన్నారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని నిండా ముంచిన మీరు నీతులు వల్లించడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం మరిన్ని అప్పులకు అనుమతిస్తే తెలంగాణను మరో శ్రీలంకలా మార్చాలనుకుంటున్నారా అని అడిగారు. విభజన చట్టం హామీల పరిష్కారానికి చొరవ తీసుకోలేదంటూ విమర్శించారు. గవర్నర్ వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లేదాకా... ముఖ్యమంత్రికి ఏరియల్ సర్వే చేయాలనే సోయి కూడా రాలేదన్నారు.