Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు కొప్పుల, మహమూద్ అలీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప లౌకిక వాదని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్‌అలి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్లో మొహర్రం పండుగ ఏర్పాట్లపై వారు ముందస్తు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలందరిని కంటికి రెప్పలా కాపాడుతూ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. వచ్చే నెల 8,9 తేదీలలో జరిగే మొహర్రం పండుగ, ఊరేగింపునకు సంబంధించిన ఏర్పాట్లపై ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని దిశా నిర్దేశం చేశారు. మైనార్టీలతో పాటు ప్రజలందరి భద్రత, సంక్షేమంకోసం అంకితభావంతో పనిచేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రధానమైన అన్ని పండుగలు, జాతరలు, ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అషుఉర్ ఖానాలకు అవసరమైన మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలనీ, ఆ చుట్టుపక్కల చెత్తాచెదారం, గుంతలు లేకుండా మరమ్మత్తులు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, ట్రాఫిక్ జామ్‌లకు అవకాశం లేకుండా చూడాలని ఆదేశించారు. తాగునీటి కొరత రాకుండా, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలకు సూచించారు.