Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ సిసిఎస్ కు చెల్లించాల్సిన డబ్బు వెంటనే చెల్లించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీ తిరుపతి, ఏ. ఆర్.రెడ్డి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్‌ను కోరారు. ఈ మేరకు శనివారంనాడు వారొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2022 జనవరి నుంచి ఇప్పటివరకు టీఎస్ఆర్టీసీ సీసీఎస్‌లో ఆరువేల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కార్మికుల జీతం నుంచి రికవరీ చేసిన రూ.25 కోట్లను ఇవ్వకుండా టార్చర్ చేస్తున్నారని పేర్కొన్నారు. సభ్యత్వం రద్దు చేసుకున్నవారు, రిటైర్డ్ కార్మికులకు కూడా సొమ్మును చెల్లించలేకపోతున్నారన్నారు. సీసీఎస్‌కు రూ.620 కోట్ల అసలు, సుమారు రూ.250 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ యూబీఐ బ్యాంకుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని విమర్శించారు. ఆ బ్యాంకు లోనే జీతం వేయాలనీ, అక్కడి నుంచే ఎక్కువ వడ్డీకి లోన్ తీసుకోవాలంటూ సర్క్యులర్ ఇచ్చి కార్మికులను సీసీఎస్ నుంచి దూరం చేస్తున్నారని తెలిపారు. సీసీిఎస్కు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.