Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నేత బక్క జడ్సన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటన పోలీసు కాల్పుల్లో మరణించిన దామోర రాకేశ్ మరణవాంగ్మూలం నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కజడ్సన్ డిమాండ్ చేశారు. తన మరణానికి రాజ్‌నాథ్‌సింగే కారణమంటూ రాకేశ్ చెప్పారని గుర్తు చేశారు. ఈమేరకు శనివారం రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డికి వారు వినతిపత్రం సమర్పించారు. అండర్ సెక్షన్-32(1) ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ చట్టం-1872 కింద రాజ్‌నాథ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. తామిచ్చిన ఫిర్యాదును సెంట్రల్ జోన్ డీసీపీకి పంపించగా, ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న నార్త్ జోన్ డీసీపీకి పంపారని వివరించారు. రాకేశ్ మరణవాంగ్మూలంతో రక్షణ శాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. గతంలో వరంగల్‌కు చెందిన బోడ సునీల్ తన మరణవాగ్ములంలో సీఎం కేసీఆర్ పేరు చెప్పగా, రెండు నెలల కింద ఖమ్మం జిల్లాలో సాయి గణేష్ మంత్రి పువ్వాడ అజరు పేరు చెప్పి చనిపోయారని గుర్తు చేశారు. వారిలో ఏ ఒక్కరిపైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉజ్మ్ షాకీర్, కేకేసీ చైర్మన్ లక్ష్మణ్ కుర్మా, కందుకూరి హరీష్ వర్ధన్, దుగ్యాల వేణు తదితరులు ఉన్నారు.