Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఎలాంటి సమ్మెలు చేయడానికి వీల్లేదనీ, వాటిని నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27నుంచి అమలోకి వచ్చే ఈ ఉత్తర్వులు ఆరు నెలలపాటు చెల్లుబాటులో ఉంటాయని పేర్కొంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా సేవలన్నింటినీ అత్యవసర సర్వీసులుగా ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ తెలిపారు. ప్రజాప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.