Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణపనులు వేగవంతం చేయాలి. మంత్రి వేముల
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం నూతన సెక్రెటేరి యట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహా రాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. సుమారు మూడు గంటల పాటు సెక్రెటెరియట్ నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ నిర్మాణంలో ఉన్న ప్రతి పనిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దూల్పూర్ రెడ్ స్టోన్ రాతి కట్టడం పనుల్లో వేగం పెంచాలని,మ్యాన్ పవర్ రెట్టింపు చేయాలని వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. ఎలివేషన్ వచ్చే క్లాడింగ్ పనులు, రౌండ్ పిల్లర్ల నగిషీల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. గ్రానైట్,ఫ్లోరింగ్ పను ల్లో ఇంకా వేగం పెంచాలన్నారు.విండో పనులు,ఫాల్ సీలింగ్ పనులు, ఎలక్ట్రి కల్, ప్లంబింగ్తోపాటు ఇతర మిగిలిన సివిల్ పనుల్లో వేగంగా పుర్తి చేయాలని కోరారు.మంత్రుల చాంబర్స్,వుడ్ వర్క్, ప్యానెలింగ్, శానిటరీ ఫిక్చర్స్, ఇంటీరియర్ వర్క్స్, కోర్ట్ యాడ్ ఎలివేషన్,ల్యాండ్ స్కేపింగ్ పనులను పరిశీలించారు.కాంపౌండ్ వాల్ కి వచ్చే రేయిలింగ్ లను పరిశీలించారు.సెక్రె టేరియట్ నిర్మాణ ప్రాంగ ణంలోని ప్రార్ధ మందిరాల నిర్మాణ పనులను చూశారు. గుడి, మసీదు, చర్చ్, సెక్యూరిటీ బ్లాక్,ఆన్స్లరీ బిల్డింగ్ ల పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అన్ని పనులు సమాంతరంగా జరగాలని, అందుకు తగ్గట్టుగానే రెట్టింపు మ్యాన్ పవర్ పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీని, ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, ఈ.ఈ శశిధర్, ఎస్.ఈలు సత్యనారాయణ, లింగా రెడ్డి పలువురు ఆర్ అండ్ బీ అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.