Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ నగరంలోని బహుజన కాలనీలో సీఐటీయూ, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, సిటీ మల్టీ స్పెషాలిటీ వారి సౌజన్యంతో వైద్య శిబిరం నిర్వహించినట్టు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు కాలనీవాసులకు వివరించినట్టు తెలిపారు. శిబిరంలో స్త్రీ వైద్య నిపుణులు, పిల్లల, జనరల్ ఫిజీషియన్ డాక్టర్లు స్థానికులకు వైద్య పరీక్షలు చేసి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మందులను ఉచితంగా అందించారని వివరించారు. నగరంలోని దొడ్డి కొమురయ్య, బహుజన కాలనీ, భారత్ రాణి నగర్ కాలనీ, 300 క్వార్టర్స్, 80 క్వార్టర్స్, 50 క్వార్టర్స్, డీఎస్ కాలనీకి చెందిన 150 మంది ప్రజలు శిబిరంలో పరీక్షలు చేయించుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేశ్‌బాబు, నాయకులు కటారి రాములు, ఐద్వా జిల్లా అధ్యక్షులు సుజాత, సిటీ మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు హైమద్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.