Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంపు గ్రామాల్లో పర్యటన.. నిత్యావసరాలు అందజేత
- భూపాలపల్లిలో మంత్రి సత్యవతి పర్యటన
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ములుగు ఎమ్మెల్యే సీతక్కకు తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం ములుగు జిల్లా ఏటూర్‌నాగారం మండలంలోని ముంపు గ్రామాల్లో పర్యటించిన.. బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తిరుగు ప్రయాణంలో ఎలిశెట్టిపెల్లి వాగులో బోటులో ఇంధనం అయిపోయింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా పడవ కొట్టుకొచ్చి చెట్టును గుద్దుకొని ఆగిపోయింది. దాంతో అక్కడి నుంచి సీతక్కతోపాటు పడవలో వున్న వారంతా క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.స్త్రీ శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండలంలో వరద బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.