Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు సీఎం కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమని తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) అధ్యక్షురాలు నీరాకిశోర్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గోదావరి నీటి మట్టం పెరిగినా ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తానని 2018లో కేసీఆర్ ఇచ్చిన హామీని ఇప్పటి వరకూ నెరవేర్చలేదని తెలిపారు. నాలుగేండ్ల క్రితం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిన సీఎం తాజాగా రూ.1,000 కోట్లతో కొత్త ఇండ్లను నిర్మించి ఇస్తానని చెబితే ఎలా నమ్మాలంటూ ఆమె ప్రశ్నించారు. నెదర్లాండ్స్ దేశం సముద్రం వద్ద కట్టలు నిర్మించిన పద్ధతిని భద్రాచలంలో అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.