Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. జిల్లాల్లో డీపీఆర్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య విమర్శించారు. కొన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ కమిటీల ప్రతిపాదనలు పట్టించు కోవడంలేదని వ్యాఖ్యానించారు. సోమవారం సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళిని సంఘం ఉపాధ్యక్షులు పి. ఆనందం, హెచ్‌యూజే నాయకులు బి. రాజశేఖర్‌తో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. చాలా జిల్లాల్లో డీపీఆర్వోలు అక్రెడిటేషన్ కమిటీల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు. అనవసర సందేహాలు, నిబంధనలు పెట్టి అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 239 జీవో ప్రకారం స్టేట్ లెవెల్ అక్రిడిటేషన్ కమిటీ ప్రతిపాదించిన మినహాయింపులను రాష్ట్రమంతా అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. చాలా జిల్లాల్లో పని చేస్తున్న జర్నలిస్టులను అర్హత లేదనీ, విద్యార్హత సర్టిఫికెట్లు పెట్టలేదనే కారణాలు చెప్పి అక్రెడిటేషన్ కార్డులను నిరాకరిస్తున్నారని వివరించారు. డీపీఆర్వోలకు సరైన ఆదేశాలిచ్చి జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని రారు. వీటితోపాటు చాలా ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులకు ఇండ్లస్దలా లు, ఇండ్లనిర్మాణం సమస్యను తమరి ద్వారా ముఖ్యమంత్రి దష్టికి తీసుకువస్తున్నామన్నారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులు ప్రయివేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేయడం లేదన్నారు. జగిత్యాల జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయి చనిపోయిన ఎన్టీవీ రిపోర్టర్ మహ్మద్ జమీర్ కుటుంబా నికి ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.