Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు టీఎంఎస్‌ఆర్‌యూ ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బహుళ జాతి కంపెనీల వేధింపుల నుంచి ఉద్యోగులను కాపాడా లంటూ మెడికల్ సేల్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి వల్ల తమ కోసం ఉన్న చట్టాలను కాదంటూ ఎంఎన్‌సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని వారు విమర్శించారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటీటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండి యా (ఎఫ్ఎంర్ఏఐ) పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా మంగళవారం ఆయా రాష్ట్రాల రాజధానులతో పాటు జిల్లా కేంద్రాల్లో బాధిత వ్యతిరేక దినం (యాంటీ విక్టిమైజేషన్ డే) ను పాటించారు. ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలను సమర్పించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల లేబర్ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటీటివ్స్ యూనియన్ (టీఎంఎస్‌ఆర్‌యూ) రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి ఎ.నాగేశ్వర్ రావు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఆయా ఫార్మా కంపెనీల ఇండియా విభాగాలు ఉద్యో గులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను ప్ల కార్డులు, నినాదాలతో ఎండగట్టారు. ఎంఎన్ సీలు చట్ట వ్యతిరేకంగా వ్యవహరి స్తున్నా కేంద్రం మౌనంగా ఉండటం సరికాదంటూ నాయకులు తప్పు పట్టారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెం టీటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా సంయుక్త ప్రధాన కార్యదర్శి కె.సునీల్ కుమార్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్, టీఎం ఎస్ఆర్యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్. భానుకిరణ్, ఐ.రాజుభట్ తదితరులు మాట్లాడారు. బహుళ జాతి కంపెనీలు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు వెయ్యి మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయని తెలిపారు. కొందరిని చట్ట వ్యతిరేకంగా ఎలాంటి కార ణాలు లేకుండా బదిలీలు చేయడం ద్వారా వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరిని వేధించేందుకు వీలుగా వారి పని పద్ధతులను ఏకపక్షంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేత నాల్లో కోత విధిస్తూ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతు న్నారని ఆరోపించారు. ఉద్యోగులకు సంబంధించి ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు యూనియన్లను సంప్రదించాలని కోరా రు. ఉద్యోగ భద్రతకు సంబంధించి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యా క్ట్ను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మి కశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లోని కలెక్టరేట్లలో కార్యాల యాల్లో మెడికల్ రిప్రజెంటీటివ్స్ ధర్నాలు నిర్వహించి కలెక్టర్ల ద్వారా వినతిపత్రాలు సమర్పించారని నాగేశ్వర్ రావు తెలిపారు. కార్యక్రమం లో టీఎంఎస్ఆర్ యూ కోశాధికారి దుర్గా ప్రసాద్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు లోకేశ్వర్ రెడ్డి, అఫ్రోజ్, చారి, సీనియర్ నాయకులు పీ.వీ.ఎస్.ఏ. ప్రసాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, కూకట్ పల్లి కార్యదర్శులు కరుణేశ్వర్, సతీష్, కిశోర్ పాల్గొన్నారు.