Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భద్రాద్రి జిల్లాలో సహాయ, పునరావాస చర్యలపై సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఇతర సీనియర్ అధికారులతో సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండ లానికి ఒక అధికారిని నియమించి సహాయ కార్యక్రమాలు చేపడుతు న్నట్టు తెలిపారు. ప్రతిగ్రామంలో మెడికల్, విద్యుత్, శానిటేషన్ విభా గాల బృందాలను నియమించి నట్టు పేర్కొన్నారు.
ఇతర జిల్లాల పారిశుధ్య సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టామనీ, ప్రస్తుతం 436 వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవలు అంది స్తున్నట్టు తెలిపారు. ఆయా శిబిరా ల్లో ఇప్పటి వరకు పదివేల మందికి పైగా వైద్య చికిత్సలు అందించినట్టు చెప్పారు. గర్భిణీల కు పీహెచ్సీల్లో వైద్యం అందిస్తున్నామని తెలిపారు.