Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి తెలంగాణకు విపత్తు సహాయ నిధిని ఇవ్వట్లేదంటూ టీఆర్ఎస్ నాయకులు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, అది పచ్చి అబద్ధమని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి కొట్టిపడేశారు. ఎనిమిదేండ్ల కాలంలో దాదాపు రూ.3 వేల కోట్ల(రూ.2970.87)ను, 2018 నుంచే రూ.1500 కోట్లను తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని అంకెలతో సహా వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో రాష్ట్రానికి 20 కస్తూర్బా పాఠశాలలను కేటాయించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.