Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దాశరధి కృష్ణమాచార్య అవార్డు-2022కిగానూ ప్రముఖ కవి, డాక్టర్ వేణు సంకోజుకు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ అవార్డు కింద హైదరాబాద్లో శుక్రవారం నాడు కృష్ణమాచార్య జయంతి కార్యక్రమంలో వేణు సంకోజుకు రూ.1,01,116 నగదు పారితోషికంతోపాటు జ్ఞాపికను అందజేసి సంత్కరించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని నినదించిన నాటి తరం తెలంగాణ కవి, దాశరధి కృష్ణమాచార్య గౌరవార్ధంగా ప్రతి ఏటా ఆయన జయంతి సందర్భంగా కవులు, రచయితలు, సాహితీవేత్తలను గుర్తించి వారిలో ఒకరికి ఆయన పేరిట ప్రతిష్టాత్మక సాహితీ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విషయం విదితమే.