Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌కు ధన్యవాదాలు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని రైసు మిల్లుల్లో ధాన్యం పాడైపోవడానికి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో బియ్యం సేకరణ (సీఎమ్మార్) చేయాలని ఎఫ్‌సీఐకి ఆదేశాలిచ్చిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్లనే మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరు కుపోయాయని విమర్శించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని రెండు నెలల పాటు ఆపేయడంవల్లే మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని ఆరోపించారు.