Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామోజీ ఫిలింసిటీలో ఇంటి పట్టాలు ఇచ్చిన వారికి స్థలం కేటాయించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ
- ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రామోజీ ఫిలింసిటీలో ఇంటి పట్టాలు ఇచ్చిన వారికి స్థలం కేటాయించాలని, దండుమైలారం హఫీజ్పూర రైతులకు పట్టాదారు పాసుబుక్‌లు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజా సమస్యలు పరిష్కరిం చాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ రామ్మో హన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం హామీలివ్వడమే తప్ప వాటిని అమలు చేయడం లేదని ఆందో ళన వ్యక్తం చేశారు. 2007లో రామోజీ ఫిలింసిటీలో 189 సర్వే నెంబర్ లో 700 మందికి ఇంటి సర్టిఫికెట్లు, దండుమైలారంలో 149 సర్వే నెంబర్లో 70 మందికి ఇంటి పట్టాలు ఇచ్చిన వారికి ఇప్పటికీ ఇంటి స్థలం కేటాయించలేదని, ఇప్పటికైనా కేటాయించాలని డిమాండ్ చేశారు.