Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-వెల్డండ..
వెల్డండ మండల పరిధిలోని పలుగు తండకు చెందిన నిరుపేద విద్యార్థులు విశాల్, వికాస్ల చదువుల కోసం ఐక్యత ఫౌండేషన్ చేయూతనందించేందుకు ముందుకు వచ్చింది. విశాల్, వికాస్ల తండ్రి నేనవత్ వస్య ప్రమాదంలో చనిపోయారు. తల్లి కులి పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరిద్దరూ ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ప్రయివేట్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. పలుగు తండాకు చెందిన యువ నాయకుడు రమేష్ నాయక్ వీరి పరిస్థితిని ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ రాఘవేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన రాఘవేందర్ రెడ్డి తక్షణ సహాయం కింద రూ. 5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. విద్యార్థులపై చదువులకు అయ్యే ఖర్చు మొత్తం తానే బరిస్తానని హామీ ఇచ్చినట్టు రమేష్ నాయక్ తెలిపారు.ముందు ముందు ఐక్యత ఫౌండేషన్ అండగా ఉంటుందని వారు తెలిపారు.