Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేయొద్దు : హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వినాయక చవితి సందర్బంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాల తయారీ, ఏర్పాట్లు..నిమజ్జనాలకు సంబంధించి ఎలాం టి ఉత్తర్వులు లేవని హైకోర్టు ప్రకటించింది. పీవోపీ విగ్రహాల తయారీని నిషేధిస్తూ ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయలేదనీ.. అందుకే ఆ విగ్రహాల తయారీని నిలిపివేస్తూ ఏవిధమైన ఉత్తర్వు లు ఇవ్వలేమని వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ 9న హైకోర్టు, సెప్టెంబర్ 16న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వు లు లేవని గుర్తు చేసింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జన ం చేయొద్దని అందుకో సం హైదరా బాద్ చుట్టూ ప్రత్యేక కుంటలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీకీ ఆదేశించింది. పీవోపీ విగ్రహాల తయారీ,అమ్మకాలు,విగ్రహ ఏర్పాట్లను అడ్డుకో వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ,పోలీసులకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్,జస్టిస్ సూరేపల్లి నందాతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది. రెండేండ్లుగా కరోనా వైరస్ వ్యాప్తి వల్ల విగ్రహాల అమ్మకాలు సాగలేదనీ, నిల్వతో పేరుకుపోయిన విగ్రహాలను అమ్ము కునేలా ఆదేశించాలంటూ వాటి తయారీదా రులు ఓమ్ ప్రకాష్, ఇతరులు హైకోర్టులో పిల్ వేశారు. పీవోపీ విగ్రహాల తయారీ చేయొద్దన్న కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) మార్గదర్శకాలను కొట్టేయాలని తెలంగాణ గణేశ్ మూర్తి కళాకారుల సంక్షేమ సంఘం మరో పిల్ వేసింది. వీటిని విచారించిన హైకోర్టు పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రౌడీషీట్‌కు ప్రమాణాలు ఏమిటో చెప్పాలని ఆదేశించింది.