Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో రైస్ మిల్లర్లు...
నవతెలంగాణ-మణుగూరు
వర్షాల కారణంగా మిల్లుల్లో నిల్వ చేసిన ధాన్యం తడిసి మొలకలు రావడంతో మిల్లర్ లబోదిబో మంటు న్నారు. వివరాలల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో నాలుగు ప్రధాన రైస్ మిల్లులు ఉన్నాయి. ఒక్కొక్క రైస్ మిల్లులో 5 వేలు నుంచి పదివేల క్వింటాల ధాన్యం నిల్వ ఉంచారు. సమితి సింగారం పరిధిలోని అశోక్ నగర్లని వసుంధర రైస్ మిల్లులో 3,500 క్వింటాల ధాన్యాన్ని నిల్వ ఉంచారు. వేసవి కాలం పంటను మార్చిలో రైస్ మిల్లులో ఆడించేందుకు ప్రభుత్వం ధాన్యాన్ని తరలించింది. ఎఫ్సీఐ అనుమతులు రాకపోవడంతో ధాన్యాన్ని మిల్లు వద్దనే ఉంచారు. వర్షాకాలంలో ధాన్యం కాపాడేందుకు 10 టార్పాలిన్ కవర్లు కప్పారు. రెండు రోజులుగా ఎండ రావడంతో టార్పాలిన్లు తీయగా.. ధాన్యం తేమకు గురై మొలకలెత్తడంతో మిల్లర్లు లబోదిబోమంటున్నారు. సుమారు రూ.40 లక్షల ధాన్యం పనికిరాకుండా పోయిందని మిల్లర్లు వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల రైస్ మిల్లర్లు బలైపోతున్నారని యాజమాన్యాలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిల్లర్లకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.