Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యాదాద్రి జిల్లా నందనంలో రూ. 8 కోట్లతో నిర్మించనున్న నీరా ఉత్పత్తి కేంద్రానికి ఈ నెల 29న శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో నీరా ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీరా ఉత్పత్తి, అనుబంధ ఉత్పత్తుల తయారీ కేంద్రాల నిర్మాణ పనులను వచ్చే మూడు నెల్లలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో టూరిజం ఎండీ మనోహర్, అబ్కారీ శాఖ అధికారులు డీసీ శ్రీనివాస్ రెడ్డి, సహాయ కమిషనర్ చంద్రయ్య, ఈ ఎస్‌లు ఎ.సత్యనారాయణ, రవీందర్ రావు, అరుణ్ కుమార్, నవీన్, విజరు భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.