Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోషులను కఠినంగా శిక్షించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఈ నెల 17న టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్వహించిన లైన్మెన్ రాత పరీక్షలో జరిగిన కాపీయింగ్ జరిగినట్టు వస్తున్న వార్తలపై యాజమాన్యం స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్యూఈఈయూ-సీఐటీయూ అనుబంధం) గౌరవాధ్యక్షులు భూపాల్, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కుమారస్వామి, వి.గోవర్ధన్ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. మళ్లీ జూనియర్ లైన్మెన్ రాత పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. కొందరు అభ్యర్థులు సెల్ ఫోన్లతో హాజరై పరీక్ష రాశారనీ, వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఏండ్ల తరబడి చదువుతున్న నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాపీయింగ్ పాల్పడిన, సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.