Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఉస్మానియా ఆస్పత్రి భవనం పనికిరాదని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టుకు ఆ కమిటీ నివేదికను అడ్వొకేట్ జనరల్ సమర్పించారు. మరమ్మతులు చేసినా ఆస్పత్రికి కాకుండా ఇతర అవసరాలకే వినియోగించుకోవచ్చని కమిటీ పేర్కొంది. ఆస్పత్రిగా వాడాలంటే ఆక్సిజన్, మంచినీరు, సివరేజీ, గ్యాస్ పైప్ లైన్లు వేయాల్సి ఉంటుందనీ, ఆ మేరకు అవసరమైన మరమ్మతులు చేస్తే భవనం హెరిటేజ్ దెబ్బతింటుందని వివరించింది. కమిటీ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం చెప్పేందుకు గడువు కావాలని ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. నివేదికపై పిటీషనర్లు అధ్యయనం చేశాక విచారణ చేపడతామంటూ న్యాయమూర్తి కేసు విచారణను ఆగస్టు 25కు వాయిదా వేశారు.