Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఎల్ఏకు వీఆర్ఏ జేఏసీ వినతిపత్రం అందజేత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హౌదా, జాబ్ చార్టు లేని విధులు మాకు వద్దని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల జాయింట్ ఆక్షన్ కమిటీ తేల్చి చెప్పింది. శనివారం హైదరాబాద్లో జేఏసీ చైర్మెన్ గోల్కొండ సతీష్, అడిషనల్ సెక్రెటరీ జనరల్ పల్లేపాటి నరేష్, వైస్ చైర్మెన్ చింతలమురళి, వైస్ చైర్మెన్ ప్రతిభ, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు కృష్ణ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణమేరి తదితరులు సీసీఎల్ఏ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వీఆర్వోలకు జాబ్ చార్ట్, సమానమైన హౌదా కల్పించే వరకు రెవెన్యూ శాఖలో అన్ని రకాల విధులకు దూరం ఉంటామని రాష్ట్ర జేఏసీ చేసిన తీర్మానాలను, నిర్ణయాలను వారు వివరించారు. ఈనెల 25 నుంచి అనధికారికమైన అన్ని రకాల విధులకు విఆర్వోలు దూరంగా ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు వీఆర్ఓలకు అపాయింట్మెంట్ ఇవ్యకపోవడం రాజ్యాంగాన్ని కించపరిచినట్టుగా తాము భావిస్తున్నట్టు స్పష్టం చేశారు.