Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమానంలో తమిళిసై వైద్యసేవలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా అర్ధరాత్రి సమయంలో ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అతడికి ప్రథమ చికిత్స చేశారు. ప్రయాణికుడు గుండెలో నొప్పి, ఇతర సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో... విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా? అని అనౌన్స్మెంట్లో అడిగారు. విషయం తెలిసిన తమిళిసై వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించి, భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు. కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపాడు అదేవిధంగా ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు ఆమెకు అభినందనలు తెలిపారు.