Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళులర్పించిన ఉద్యోగులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నవతెలంగాణ తెలుగు దినపత్రిక సీనియర్ ఉద్యోగి కామ్రేడ్ ఎర్ర రాజు శనివారం ఉదయం 9.30 గంటలకు గుండెపోటుతో దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో మృతిచెందారు. ఆయనకు భార్య కల్పన, కుమారుడు హేమంత్, కూతురు కీర్తన ఉన్నారు. రాజుకు అన్న, ఇద్దరు తమ్ముళ్లు, అక్క ఉన్నారు. 1970 ఏప్రిల్ 27న ముషీరాబాద్‌లో రాజు జన్మించారు. ఎస్ఎస్సీ వరకు ఎంబీఏ స్కూల్లో చదివాడు. తర్వాత ప్రింటింగ్ ఫీల్డ్‌లోకి వచ్చారు. ఆయన ప్రజాశక్తిలో 1998లో చేరాడు. అప్పుడే ప్రజాశక్తిలో కలర్ మిషన్ వచ్చింది. కలర్ మిషన్కి ఆపరేటర్‌గా తన సేవలు అందించాడు. ఉద్యోగంలో క్రమశిక్షణతో ఎంతోమందికి పని నేర్పించాడు. రాజు మరణ వార్త తెలియగానే నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్, ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్, ప్రింటింగ్ ప్రెస్ జనరల్ మేనేజర్ రఘు ఆస్పత్రికి వెళ్లారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. రాజు మృత దేహాన్ని నవతెలంగాణ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చి ఉద్యోగుల సందర్శనార్థం ఉంచారు. ఉద్యో గులు నివాళ్లర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో సీజీఎం ప్రభాకర్, ఉద్యోగులు ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రాజు మృతి నవతెలంగాణకు తీరని లోటని సీజీఎం, ఎడిటర్ అన్నారు.