Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్కు బాధితుడి తరలింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని కామారెడ్డిలో ఓ అనుమానిత కేసు వెలుగుచూసింది. కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈనెల ఆరున కామారెడ్డికి వచ్చిన వ్యక్తికి జ్వరం, శరీరంపై దద్దుర్లు వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఈనెల 20న జ్వరం, 23న దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్ లక్షణాలుగా అనుమానించి ఆదివారం బాధితున్ని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి.