Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి బహిరంగ లేఖ
- బక్క జడ్సన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్టీ మార్పు చారిత్రక అవసరం అని స్పష్టం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజినామా చేసి పార్టీ మారాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బక్కజడ్సన్ ఆయనకు సోమవారం బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగటం నైతిక విలువ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రజ సమస్యలపై ఏ రోజూ స్పందించని మీరు.. మీ వ్యాపారసామ్రాజ్యాన్ని విస్తరించే ధ్యేయంతోనే కాంగ్రెస్ పార్టీని వాడుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు పై గెలిచి, ఆ పార్టీకి ద్రోహం చేసి గతంలో 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లారని గుర్తుచేశారు. అయినా కాంగ్రెస్‌పార్టీ ప్రజల హృదయాల్లో ఉందని తెలిపారు. ఇప్పుడు మీరు పోయినా పార్టీకి నష్టం జరగదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరుతున్నట్టు సంకేతాలిస్తూ..కాంగ్రెస్‌ను బలహీన పర్చాలని చూస్తే కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉంటూ ఆ ప్రాంత పోడు రైతులగురించి కూడా పట్టించుకోలేదని విమర్శించారు. జైలుకు పోయోచ్చినోళ్లతో మాట్లాడనని చెప్పే మీరు..అమిత్‌షా కూడా జైలుకు పోయోచ్చిన విషయాన్ని మరిచిపోయారా? అని ప్రశ్నించారు.