Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆగస్టు నాలుగో తేదీన ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం జరగ నుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ తుది పనులను గురువారం మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెయిన్ ఎంట్రన్స్, పోర్టీకో, గ్రాండ్ ఎంట్రీ, మ్యూజియం, ఆడిటోరియం, అంతస్థులవారీగా పనులను తనిఖీ చేశారు. మిగిలిన పనులను మ్యాన్ పవర్ పెంచి ప్రారంభోత్సవంలోపు పూర్తి చేయాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని అదేశించారు. ప్రారంభోత్సవ అలంకరణ ప్రత్యేక ఆకర్షణీ యంగా ఉండేలా చూడాలని సూచించారు. ప్రారంభం అనంతరం సీఎం కేసిఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కలియ తిరగనున్నారని చెప్పారు.ప్రారంభోత్సవం అనంతరం 14వ అంతస్తు నుంచి హైదరాబాద్ నగరాన్ని సందర్శకులు వీక్షించే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి వెంట డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర సీపీ సి.వి ఆనంద్, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఐ. గణపతిరెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సి కౌశిక్ రెడ్డి పలువురు ఆర్ అండ్ బీ, పోలీసు అధి కారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
సీవీ ఆనంద్ మెమో
పోలీస్ టవర్స్ ప్రారంభతోత్సవం నేప థ్యంలో ప్రాజెక్టుతో అనుబంధం ఉన్న అన్ని శాఖలకు సీటీ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ ఒక మెమోను జారీ చేశారు. ప్రారంభోత్సవానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని ఆయన కోరారు. చారిత్రాత్మకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం సాగుతున్నదనీ, అయితే లాజిస్టిక్స్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్‌కు సంబంధించిన పెండింగ్ పను లను పూర్తి చేయాలని కోరారు.