Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు, డీజీ
భారీ ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-సంగారెడ్డి
పేదలందరికీ ఇండ్ల స్థలాలు సాధించే వరకూ పోరాటం ఆగదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు, డీజీ నరసింహారావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పేదలు భారీ ర్యాలీగా వెళ్లి గురువారం తహసీల్దారన కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం జరిగిన ధర్నాలో చుక్క రాములు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు వేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై పన్నులు వేసి ప్రజలను పీల్చుకు తింటోందన్నారు. సదాశివపేట పట్టణంలో 18 ఏండ్ల నుంచి ఏ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వలేదని, ఇండ్లు లేక పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెబుతున్నా జిల్లాలో ఇంతవరకు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. సదాశివపేట పట్టణంలో ఉమ్మడి రాష్ట్రంలో 5,300 మందికి పట్టాలిచ్చినా ఇంతవరకు పొజిషన్ చూపించలేదన్నారు. తక్షణమే వారికి పొజిషన్ చూపించాలని డిమాండ్ చేశారు. సిద్దాపూర్ కాలనీలోని ప్రభుత్వ భూమిలో పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ప్రచారం నిర్వహించినా ఇప్పటివరకు కేవలం 12 వేల మందికి మాత్రమే మంజూరు చేశారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఇండ్లు కట్టిస్తామని ఎన్నికల ముందు చెప్పినా ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు.
పట్టణాల్లో జనాభా పెరుగుతున్నా వారి సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఆశాజ్యోతి ధర్నా శిబిరానికి వచ్చి మాట్లాడారు. పేదల దరఖాస్తు లను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తా మని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్య క్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి.జయరాజ్, జిల్లా నాయకులు బి.మల్లేశం, యాదవ్రెడ్డి, వి.ప్రవీణ్‌కుమార్, స్థానిక నాయకులు మల్లేష్, సంతోష్, మహేష్, నర్సింలు, కయుమ్, దాస్, ఏసోబ్, భాస్కర్, సిద్ధిరాములు, ఖలీల్, ఖాజా, షారు, స్వరూప, యాదమ్మ, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.